ETV Bharat / entertainment

నటిపై క్యాబ్​ డ్రైవర్​ వేధింపులు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. - మానవ నాయక్​ క్యాబ్ డ్రైవర్​ వేధింపులు

మహారాష్ట్ర ముంబయిలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి, దర్శకురాలు మానవ నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యాక్సీలో ఇంటికి వెళ్తుండగా ఉబర్‌ డ్రైవర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అసలు ఏం జరిగందంటే?

actor manava naik
actor manava naik
author img

By

Published : Oct 17, 2022, 7:33 AM IST

ఓ క్యాబ్‌ డ్రైవర్‌ నుంచి తనకు ఎదురైన భయానక అనుభవాన్ని మరాఠా నటి, దర్శకురాలు మానవ నాయక్‌ వెల్లడించారు. శనివారం రాత్రి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోగా ఆ డ్రైవర్‌ తనతో తప్పుగా ప్రవర్తించాడని.. భయభ్రాంతులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకోగా.. దీనిపై ముంబయి సంయుక్త పోలీస్‌ కమిషనర్ (శాంతిభద్రతలు) విశ్వాస్‌ నాగ్రే పాటిల్‌ స్పందించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మానవ నాయక్‌ పలు మరాఠి చిత్రాలతో పాటు అనేక హిందీ టీవీ షోలలో నటించారు.

నటి ఫేస్‌బుక్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. "శనివారం రాత్రి 8.15 గంటల సమయంలో బీకేసీ నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్నా. లోపలికి ఎక్కి కూర్చున్న తరువాత ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని అభ్యంతరం చెబుతున్నా వినడంలేదు. బీకేసీ వద్ద సిగ్నల్‌ జంప్‌ చేసి ట్రాఫిక్‌ రూల్స్‌ని ఉల్లంఘించాడు. పోలీసులు క్యాబ్‌ని ఆపి ఫొటో తీసుకున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో నేను జోక్యం చేసుకొని.. ఫొటో తీశారు గనక వదిలేయాలని కోరడంతో పోలీసులు ఆ వాహనాన్ని వదిలిపెట్టారు.

అయితే, పోలీసులు విధించిన ఫైన్‌ రూ.500 మీరు చెల్లిస్తారా? అంటూ ఆ డ్రైవర్‌ నాపై కోపంగా అరిచాడు. చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. దీంతో క్యాబ్‌ని పోలీస్‌ స్టేషన్‌కు పోనివ్వవాలని అడగడంతో అతడు వాహనాన్ని బీకేసీ వద్ద ఓ చీకటి ప్రదేశంలో నిలిపాడు. ఆ తర్వాత డ్రైవర్‌ వాహనాన్ని చునాభట్టి రోడ్‌, ప్రియదర్శిని పార్క్‌ మార్గంలో వేగంగా తీసుకెళ్లాడు. దీంతో ఫిర్యాదు చేసేందుకు ఉబర్‌ సేఫ్టీ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశా. హెల్ప్‌లైన్‌ ఎగ్జిక్యూటివ్‌ కాల్‌లో ఉండగానే ఆ డ్రైవర్‌ మరోసారి క్యాబ్‌ స్పీడ్‌ని పెంచాడు. కారు ఆపాలని అడిగినా.. ఆపకుండా ఎవరికో కాల్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో చాలా భయం వేసి సాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టా. రెండు మోటార్‌ బైక్‌లు, ఒక ఆటో రిక్షా క్యాబ్‌ని కార్నర్‌ చేసి ఆపి నన్ను కాపాడారు. నేను సురక్షితంగానే ఉన్నా.. కానీ భయపడ్డా" అని నటి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.