ETV Bharat / entertainment

'దేవుడా అందరికీ చెప్పలేక చస్తున్నా'.. జగ్గూ భాయ్ సాయిబాబా​ పూజ వీడియో వైరల్​! - జగపతిబాబు లేటెస్ట్​ వార్తలు

టాలీవుడ్​ సీనియర్​ నటుడు జగపతిబాబు.. సోషల్​మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియో షేర్​ చేసిన ఆయన.. 'దేవుడా అందరికీ చెప్పలేక చస్తున్నా' అంటూ క్యాప్సన్ ఇచ్చారు.

Actor Jagapathi Babu Video
Actor Jagapathi Babu Video
author img

By

Published : Nov 13, 2022, 8:30 PM IST

Actor Jagapathi Babu Video: విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్​గా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నారు సీనియర్‌ నటుడు జగపతిబాబు. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ను చాలా మంది 'జగ్గూ భాయ్‌' అని పిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలకరిస్తుంటారు. ఈ సారి సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియోను షేర్​​ చేశారు.

సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. 'దేవుడా.. అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకు ఇచ్చేయ్‌.. చెప్పలేక చస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 'మీ కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నా'.. అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా.. 'హహహ ఏం టైమింగ్ సార్‌' అని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు.

ఈ ఏడాది 'రాధేశ్యామ్‌', 'గని', 'పరంపర సీజన్‌ 2'లో జగ్గూ భాయ్​ మెరిశారు. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'సలార్‌'లో కీ రోల్ చేస్తున్నారు. దీంతోపాటు కన్నడలో 'కబ్జా', మలయాళంలో 'వాయిస్ ఆఫ్​ సత్యానందన్‌'లో నటిస్తున్నారు. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.