ETV Bharat / entertainment

భార్యతో చిరంజీవి ఫారిన్​ టూర్‌.. 'గాడ్‌ ఫాదర్' ఇంట్రెస్టింగ్​ అప్డేట్ - చిరంజీవి గాడ్​ఫాదర్​

ఇటీవలే 'ఆచార్య'తో ప్రేక్షకుల్ని పలకరించిన మెగాస్టార్ చిరంజీవి.. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ టూర్​కు వెళ్తున్నట్టు తెలిపారు. తమ ప్రయాణానికి సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేశారు.

Chiranjeevi family tour
చిరు ఫ్యామిలీ టూర్
author img

By

Published : May 3, 2022, 1:39 PM IST

'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన చిరంజీవి, తదుపరి సినిమాల చిత్రీకరణ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. కొవిడ్‌ తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ వెళ్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ ప్రయాణానికి సంబంధించిన ఫొటోని పోస్ట్‌ చేశారు. 'హ్యాపీ జర్నీ', 'ఎంజాయ్‌ ది ట్రిప్‌' అంటూ నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు.

తమన్‌ సంగీతం.. ప్రభుదేవా నృత్యం.. మరోవైపు, చిరు నటిస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' నుంచి సినీ అభిమానులకు ఆసక్తికర కబురు అందింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కనున్న హుషారైన గీతానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారంటూ సంగీత దర్శకుడు నెట్టింట ఫొటోను విడుదల చేశారు. గతంలో చిరు- ప్రభుదేవా కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలు రావడంతో ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మలయాళం సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంతోపాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు చిరు. నటి రాధికా నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఇదీ చూడండి: నా సినిమా కోసం మళ్లీ మళ్లీ అలానే చేస్తా: విశ్వక్​ సేన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.