Actor Brahmaji On Body Shaming: నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం తన సెల్ఫీను పోస్ట్ చేస్తూ 'ఏం జరుగుతోంది?' అని ఫ్యాన్స్‌ను అడిగారు. 'ఏం లేదు అంకుల్' అని ఓ నెటిజన్/అభిమాని బ్రహ్మాజీకి రిప్లై ఇచ్చారు. సదరు ట్వీట్‌ను బ్రహ్మాజీ రీట్వీట్ చేస్తూ 'అంకుల్ ఏంటి? అంకుల్. కేసు వేస్తా. బాడీ షేమింగ్ చేస్తున్నావా?' అని నవ్వుల ఎమోజీ జత చేశారు. ఆయన ఇలా అనడమే ఆలస్యం వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్స్, వందల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి. ట్విట్టర్‌లో చురుకుగా ఉండే చాలామంది తమదైన శైలిలో చమక్కులు విసిరారు. ఫన్నీ మీమ్స్ పెట్టారు.
'అన్నా.. మళ్లీ రెచ్చగొట్టారు ఆంటీని', 'మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా.. ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు', 'హే.. మీరూ వేసేశారు', '#SayNoToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్ మర్చిపోయారు అంకుల్', 'మాస్ ట్రోలర్', 'టైమింగ్', 'అంకులా.. మజాకా' అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా 'ఆంటీ' అంటూ తనని కొందరు బాడీ షేమింగ్ చేస్తున్నారని నటి, వ్యాఖ్యాత అనసూయ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ చేసిన ఈ సరదా వ్యాఖ్య ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇవీ చదవండి: అయ్యో పాపం శ్రద్ధా, అనసూయకు సపోర్ట్ చేసినందుకు