ETV Bharat / entertainment

ఆ చిత్రంతోనే తాను నటుడిగా మారానంటున్న బ్రహ్మాజీ

ఎన్నో తెలుగు సినిమాల్లో నెగిటివ్​ రోల్స్​ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బ్రహ్మజీ. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన అందరిలా తాను సినిమా కష్టాలు పడలేదని కెరీర్‌ ఇప్పుడు బాగుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వాటితో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే

brahmaji
brahmaji
author img

By

Published : Aug 15, 2022, 9:31 PM IST

Actor Brahmaji: తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడు, నెగటివ్‌ రోల్స్‌ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నటుడు బ్రహ్మాజీ. కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'శంకరాభరణం' సినిమా వల్లే తాను నటుడిగా మారనని చెప్పుకొచ్చారు. అందరిలా తాను సినిమా కష్టాలు పడలేదని.. కెరీర్‌ ఇప్పుడు బాగుందని అన్నారు.

"నేను తూర్పుగోదావరి జిల్లాలో పుట్టాను. పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగా. మా నాన్న తహసీల్దార్‌. అప్పట్లో సీనియర్‌ నటుడు సోమయాజులుగారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన నటించిన 'శంకరాభరణం' విడుదలై సూపర్‌హిట్‌ అయ్యింది. దాంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సినిమాల్లోకి వెళితే ఇంత ఆదరణ లభిస్తుందా..! అని అప్పుడే అనిపించింది. ఎలాగైనా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని అనుకున్నా."

-- నటుడు బ్రహ్మాజీ

"చదువు పూర్తైన వెంటనే చెన్నై వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలోనే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర వంటి పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్లందరూ కూడా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'సింధూరం' వంటి చిత్రాల వల్ల కెరీర్‌ ఆరంభంలో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత పదేళ్లు పాటు నేను సంతృప్తి చెందే పాత్రలు దొరకలేదు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తున్నాయి. హాస్యనటుడు, సహాయనటుడు, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ చేస్తున్నాను." అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ.

"బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఓ వ్యక్తి నుంచి విడాకులు తీసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పుడే ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమెను ఇష్టపడి పెద్దలకు చెప్పి వివాహం చేసుకున్నా. వివాహమయ్యే సమయానికి ఆమెకు ఓ బాబు ఉన్నాడు. బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అనిపించింది. అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాం. ఆ అబ్బాయే 'పిట్టకథ'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు" అంటూ తన వ్యక్తిగత జీవితంపై బ్రహ్మాజీ స్పందించారు.

ఇవీ చదవండి: బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న బాలీవుడ్​ మూవీలు, కారణం అదేనా

లైగర్​ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.