ETV Bharat / entertainment

విలన్​గా అల్లరోడి అన్న.. ఆ బడా డైరెక్టర్​తో సినిమా! - నటుడు ఆర్యన్​ రాజేశ్​ కొత్త సినిమా

నటుడు ఆర్యన్​ రాజేశ్​ త్వరలోనే విలన్​గా నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఓ బడా డైరెక్టర్​ ఆయన్ను ప్రతినాయకుడిగా పరిచయం చేయబోతున్నారట.

aryan rajesh
విలన్​గా ఆర్యన్​ రాజేశ్​
author img

By

Published : Sep 22, 2022, 9:17 PM IST

'ఎవడిగోల వాడిది', 'నువ్వంటే నాకిష్టం', 'సొంతం','హాయ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్యన్​ రాజేశ్​. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. హీరోగా నిలుదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. ​ కానీ ఆ తర్వాత సినీ పరిశ్రమకు కొన్నేళ్ల పాటు దూరమయ్యారు. ఆ తర్వాత వినయ విధేయ రామలో రామ్ చరణ్ సోదరుడిగా రీఎంట్రీగా ఇచ్చారు. కానీ ఆ పాత్రకు అంతగా స్కోప్​ లేదు.

మళ్లీ కాస్త గ్యాప్​ ఇచ్చిన ఆయన ఇటీవలే హలో వరల్డ్​ అనే వెబ్​సిరీస్​తో ప్రేక్షకులను పలకరించారు. ఇది మంచి రెస్పాన్స్​ అందుకుంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సారి ఆయన విలన్​గా నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఓ బడా డైరెక్టర్ ఆర్యన్ రాజేష్ ను విలన్​గా పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఆ కథ, పాత్ర కూడా ఆర్యన్​కు నచ్చిందట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈయన సోదరుడు హాస్యనటుడు అల్లరి నరేశ్​.. ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నారు.

ఇదీ చూడండి: వైరల్​గా చిరు ట్వీట్​ ​.. నా ఊపిరి.. గుండె చప్పుడు అన్ని వారేనంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.