ETV Bharat / entertainment

'ఆచార్య 'లాహేలాహే ప్రోమో..'సర్కారు వారి పాట' సూపర్​ అప్డేట్​ - జెర్సీ

Movie Updates: మరికొన్ని మూవీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో చిరంజీవి 'ఆచార్య', మహేశ్​​ బాబు 'సర్కారు వారి పాట' సహా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

Movie updates
Movie updates
author img

By

Published : Apr 22, 2022, 9:51 PM IST

Acharya Movie Laahe Laahe Song Promo: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్​ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి 'లాహే లాహే' గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్​ కంపెనీ సోషల్ మీడియాలో షేర్​ చేసింది. ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్న 'లాహే లాహే' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, నటి సంగీత స్టెప్పులు, హావభావాలు అదిరాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sarkaru Vaari Paata Latest Update: సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా, మహేశ్​ బాబు ఫోటోను రిలీజ్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్​ను ఇచ్చారు మేకర్స్​. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్తయిందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. కొత్త పోస్టర్​లో మహేశ్​ లుక్​ అదిరిపోయింది. ఈ మూవీని మే12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Vikram Cobra Movie Song Release: విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ విల‌క్షణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకునే నటుడు విక్ర‌మ్. తమిళ హీరోనే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. గ‌త కొంతకాలంగా స‌రైన హిట్టు సాధించని విక్ర‌మ్‌కు 'మహాన్' మంచి కంబ్యాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ 'కోబ్రా'. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎప్పుడో ప్రారంభమైన షూటింగ్​ ఇటీవలే పూర్తయింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే25న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'అధీరా' లిరిక‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

'ధీరా ధీరాది ధీరా తుపాకీ మందీరా' అంటూ సాగే ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. పా విజ‌య్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను వ‌గు మ‌జాన్ ఆలపించాడు. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ పాట క్య‌ాచీగా రాప్ ట్యూన్‌తో ఆక‌ట్టుకుంటుంది. సెవ‌న్ స్కీన్ స్టూడియోస్ ప‌తాకంపై ఎస్ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విక్ర‌మ్‌కు జోడీగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్‌, రోష‌న్ మాథ్యూ, ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్, మ‌ృణాళినీ ర‌వి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Shahid Kapoor Reply To Hero Nani Tweet: షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జెర్సీ' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్​రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్​లు సంయుక్తంగా నిర్మించారు. సినిమాను చూసిన హీరో నాని.. ప్రశంసలు కురిపించారు. సినిమా మరోసారి సిక్సర్​ కొట్టిందంటూ ట్విట్టర్​ వేదికగా కొనియాడారు. ఈ పోస్ట్​పై షాహిద్ కపూర్ స్పందిస్తూ, థాంక్స్ తెలిపారు. ఒక అర్జున్ నుంచి మరొక అర్జున్​కు అంటూ చెప్పుకొచ్చారు. 'జెర్సీ' మాతృకలో నాని హీరోగా నటించారు.

  • Thank you. From one Arjun to another. Big love my friend. You have a big heart and that’s what jersey is all about. More power to you. https://t.co/mMOkevCH5T

    — Shahid Kapoor (@shahidkapoor) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: వసూళ్ల వేటలో దూసుకెళ్తున్న 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'

రామ్​ 'బుల్లెట్'​ సాంగ్​ రిలీజ్​..​ సూపర్​ గర్ల్​ మేకింగ్​ వీడియో అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.