Acharya movie koratala siva: "ఇద్దరు బలమైన స్టార్లతో సినిమా చేస్తున్నప్పుడు... ప్రేక్షకుల్ని అలరించే వాణిజ్యాంశాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అది దృష్టిలో పెట్టుకునే 'ఆచార్య'ని తెరకెక్కించా" అన్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ విలేకర్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"పెద్ద కాన్వాస్... బలమైన భావోద్వేగాలతో కూడిన సినిమాల్ని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది 'ఆచార్య'. నేను రాసుకునే పాత్రలు నిజాయతీగా ఉంటాయి. 'మిర్చి'లో ప్రభాస్ పాత్ర మొదలుకొని గమనించినా వాళ్లు ఆయా కథల్లో ఎలా స్పందించినా అందులో నిజాయతీ కనిపిస్తుంది. నేనూ బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తాను. 'నువ్వు చెప్పే ముందు చెయ్యి' అని మా అమ్మ, నా భార్య తరచూ గుర్తు చేస్తుంటారు".
"స్వామి వివేకానంద జీవితంపై 'గాంధీ' తరహా సినిమా చేయాలని ఉంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. నేను అంత పరిశోధన చేసి, అంత అనుభవం వచ్చిందంటే చేస్తా. నేను తెలుసుకున్న గొప్ప వ్యక్తుల జీవితాల్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన బోధనలు, ఆయన సందేశం ప్రపంచానికి చేరాలంటే ఆయన జీవితం తెరకెక్కాల్సిందే అనిపిస్తుంది. చేస్తే హాలీవుడ్‌వాళ్లు 'గాంధీ' తీసినట్టుగా పెద్ద స్థాయిలో తీయాలి. తదుపరి నా సినిమా ఎన్టీఆర్‌తోనే. అది హై ఓల్టేజ్ సినిమా. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 కదా. అప్పటికి ఆ దాని గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి".
ఇదీ చూడండి: చిరు లీక్స్.. 'భవదీయుడు' సినిమాలోని డైలాగ్ చెప్పేసిన మెగాస్టార్