Acharya Bale Bale Bhanjara Full Song: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి 'భలే భలే బంజారా' పూర్తి గీతాన్ని విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే చిరంజీవి, రామ్‌చరణ్ సంభాషణతో కూడిన టీజర్ వీడియో, గ్లింప్స్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. సోమవారం సాయంత్రం పూర్తి పాటను విడుదల చేసింది. పాటలో చిరంజీవి, రామ్‌చరణ్ స్టెప్పులతో అదరగొట్టారు. చిరు గ్రేస్.. సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి హావభావాలు అదిరిపోయాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. రామ్‌చరణ్, చిరంజీవి కలిసి ఒకే పాటకు పూర్తి స్థాయిలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవ్వనుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇవీ చదవండి: రిలీజ్ డేట్‌తో నాగశౌర్య.. 'అంటే సుందరానికి!' అప్డేట్