ETV Bharat / entertainment

రజనీకాంత్ కూతురి ఇంట్లో భారీ దొంగతనం.. 60 సవర్ల బంగారం, వజ్రాలు​ మాయం - ఐశ్వర్య రజనీకాంత్​ బంగార మాయం

సూపర్​స్టార్​ రజనీ కాంత్​ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్​ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. లాకర్​లో ఉన్న 60 సవర్ల బంగారం, వజ్రాలు, నవరత్నాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

Aishwarya rajinikanth complaints a jewel theft in her house

author img

By

Published : Mar 20, 2023, 10:14 AM IST

Updated : Mar 20, 2023, 11:36 AM IST

తమిళనాడు.. చెన్నైలోని సూపర్​ స్టార్​​ రజనీకాంత్​ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్​ ఇంట్లో చోరీ జరిగింది. లాకర్​లో ఉన్న 60 సవర్ల బంగారం, వజ్రాలు, నవరత్నాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఐశ్వర్య.. స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

"2019లో నా చెల్లెలి పెళ్లి తర్వాత మూడుసార్లు ఇళ్లు మారాను. సెయింట్ మేరీస్‌ రోడ్డులోని ఓ ఇల్లు, సీఐటీ నగర్​లో నటుడి ధనుశ్​ ఇల్లు, నాన్న గారి ఇల్లు.. ఈ మూడు ఇళ్లల్లో ఒక్కసారి కూడా లాకర్​ ఓపెన్​ చేయలేదు. లాకర్‌లో ఉంచిన నగలను తీయలేదు. తాజాగా లాకర్​ తెరవగా.. అందులో ఉన్న 60 సవర్ల బంగారు నగలు, వజ్రాలు, నవరత్నాలు మాయమయ్యాయి. ఆభరణాలను సంబంధిత లాకర్‌లో ఉంచుతున్నట్లు నా ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు తెలుసు" అని ఫిర్యాదులో రాసుకొచ్చారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

అయితే రజనీ కాంత్‌ కుమార్తె ఐశ్వర్య.. నటుడు ధనుశ్​తో విడిపోయే వేరేగా ఉంటున్నారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గతేడాది వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్​లో వారి పేర్లను మార్చుకుని వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు.

వీరిద్దరు విడిపోతున్నట్లు గతేడాది జనవరి 27న ధనుశ్​ తన ట్విట్టర్​​ ఖాతాలో పోస్ట్‌ చేశారు. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుశ్​ లేఖలో పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం, వీరి విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వారి కుటుంబాలు రజనీ కాంత్‌ నివాసంలో సమావేశమయ్యాయని అక్కడ చర్చలు జరిగాయని వారిద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారని అంటున్నారు. ఈ వార్తలపై మాత్రం అటు ధనుశ్​ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఐశ్వర్య.. లాల్​ సలామ్​ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో రజనీ కాంత్​ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Last Updated : Mar 20, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.