2018 Movie Malayalam Collection : ఇండియన్ సినిమాలో మాలీవుడ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. అతి తక్కువ బడ్జెట్లో చిన్న కథలతో.. నేటివిటికీ దగ్గరగా నేచురల్ యాక్టింగ్‌తో విలేజ్ డ్రామా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలను ఎక్కువగా ఎంచుకుని సూపర్ సక్సెస్‌ను అందుకుంటుంటారు. యాక్షన్, థ్రిల్లర్, లవ్, హారర్... జానర్ ఏదైనా భిన్నంగా, సింపుల్‌గా తెరకెక్కించి సక్సెస్‌తో పాటు వసూళ్లను సాధిస్తారు. అయితే గత కొంతకాలంగా కలెక్షన్ల విషయంలో అక్కడి చిన్నపెద్దా చిత్రాలు కాస్త నిరాశపరుస్తున్నాయి. కొన్ని మాత్రమే మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ఓ చిన్న సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా 10 రోజుల్లోనే రూ.100కోట్ల వసూళ్లను సాధించింది. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో కాకుండా కేవలం అక్కడి బాక్సాఫీస్ వద్దే ఈ కలెక్షన్స్‌ను అందుకోవడం విశేషం.
ప్రతిఒక్కరూ హీరోనే.. టోవినో థామస్ హీరోగా జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్‌లో రిలీజైంది '2018' చిత్రం. 'ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో' అనేది ఉపశీర్షిక. క్యాప్షన్‌కు తగ్గట్లే ఈ కథ నడుస్తూ ముందుకెళ్తుంది. అంటే ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ హీరోలే అని అర్థం. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వందల మంది మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్నే కథాంశంగా తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ సినిమాను తెరకెక్కించారు. సామాన్యులు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించారు. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఓ ప్రాంతంలో సహాయక చర్యలు ఏ విధంగా సాగాయి? ఆ సహాయక చర్యల్లో అక్కడి ప్రజలు ఎలా భాగమయ్యారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వేగంగా వంద కోట్ల క్లబ్‌లోకి.. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన '2018'.. మే 5న కేవలం మలయాళం బాక్సాఫీస్ ముందే రిలీజ్ అయ్యింది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మలయాళ సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇటీవలే రిలీజైన ఈ చిత్రం కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు రూ.100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినా.. అవి ఫుల్ రన్‌లో ఆ మార్క్‌ను అందుకున్నాయి.
ఇకపోతే రీసెంట్గా మరో మలయాళీ చిత్రం అక్కడి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను అందుకుని మంచి వసూళ్లను సాధించింది. హారర్ కామెడీ 'రోమాంచమ్' మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత తెలుగులోకి కూడా డబ్ అయి ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌లో విశేష ఆదరణ దక్కించుకుంది.
ఇదీ చూడండి: కంటి చూపుతో కుర్రాళ్లను కవ్విస్తున్న మాలయాళీ ముద్దుగుమ్మ