ETV Bharat / entertainment

'ఇంద్ర' @20 ఇయర్స్​.. ఆ డైలాగ్​లను అలా రాశారు! - ఇంద్ర సినిమా

చిరంజీవి ఎవర్​గ్రీన్​ హిట్స్​ జాబితా చెప్పండి అంటే ఈ తరం వాళ్లు ఠక్కున చెప్పే పేరు 'ఇంద్ర'. వరుస పరాజయాల తర్వాత చిరును మళ్లీ ఫామ్​లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. డ్యాన్సులు, ఫైట్​లు, లుక్స్​ ఇలా అన్నింటిలోనూ అభిమానులు కొత్త చిరంజీవిని చూశారు. థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అందుకే మెగా ఫ్యాన్స్​కు ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్​ పెట్టి రికార్డులు తిరగరాసిన ఈ సినిమా రిలీజై నేటికి 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఓ సారి గుర్తుచేసుకుందాం...

indra
ఇంద్ర
author img

By

Published : Jul 24, 2022, 4:56 PM IST

Updated : Jul 24, 2022, 5:12 PM IST

'వీరశంకర్​ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా'.. థియేటర్​లో ప్రేక్షకుల చేత విజిల్స్​ కొట్టించిన డైలాగ్​ ఇది. ఈ సన్నివేశంలో మెగాస్టార్​ డైలాగ్​ డెలివరీ.. మణిశర్మ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కాంబినేషన్ ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించింది. ఇదొక్కటే కాదు ఇలాంటి మరెన్నో డైలాగ్స్​, పాటలు, చిరు డ్యాన్స్​, ఫైట్స్​ ఇలా ఫ్యాన్స్​కు ఫుల్​మీల్స్​ పెట్టేసిన చిత్రం 'ఇంద్ర'. బీ గోపాల్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజై నేటికి సరిగ్గా 20 ఏళ్లు గడిచింది. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్​మీడియా వేదికగా చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ 'సినిమా ఇరవైఏళ్లు అయింది అయినా పవర్​ తగ్గలా'.. అని సంబరపడుతున్నారు. ఓ సారి చిత్ర విశేషాలను నెమరువేసుకుందాం..

ట్రెండ్​ సెట్​ చేసిన వీణస్టెప్​..
ఈ సినిమాలో అన్ని పాటలూ హిట్టే. 'భం భం భోలే', 'రాధే గోవిందా', 'అమ్మడో అప్పచ్చి', 'ఘల్లు ఘల్లుమని', 'అయ్యో అయ్యో' ఇలా ప్రతీపాట ఆకట్టుకుంది. అయితే సినిమా మొత్తానికి స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచిన పాట.. 'దాయి దాయి దామ్మ'. అందులో చిరు వేసే వీణ స్టెప్పుకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు. లారెన్స్​ కొరియోగ్రఫీలో చిరు వేసిన ఆ స్టెప్పులను చూసి థియేటర్లలో అభిమానులు చేసిన రచ్చ మాములుగా లేదు. అప్పటి వరకు చిరు వేసిన స్టెప్పులు ఒకఎత్తు అయితే.. ఈ స్టెప్పు చిరు డ్యాన్స్​ ఇమేజ్​ను మరో మెట్టు ఎక్కించింది. ఈ క్రేజ్​ కేవలం థియేటర్లకే పరిమితం కాలేదు. చిన్న పిల్లల నుంచి కుర్రకారు దాకా అందరూ ఈ స్టెప్పును ఒక్కసారైనా ట్రై చేసిన వారే. ఇంద్ర తర్వాత చాలా సినిమాల్లో ఈ స్టెప్పు రిఫరెన్సులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు వీణస్టెప్పుకు ఉన్న క్రేజ్​ ఏంటో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మీది తెనాలి.. మాది తెనాలి'
ఈ సినిమా పేరుకు ఫ్యాక్షన్​ బ్యాక్​డ్రాప్​ అయినా ఇందులో కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్​హాఫ్​లో బ్రహ్మానందం, ఎంఎస్​ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్​లు చేసే కామెడీకి ప్రేక్షకులు పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. తెనాలి నుంచి వచ్చే ఏవీఎస్​ను మాది కూడా తెనాలే అంటూ ఎంఎస్​ నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం బురిడీ కొట్టించడం మొదలైన సీన్లు నవ్వులు పూయించాయి. ఇలా ఈ చిత్రంలో కామెడీ కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆ తర్వాత 'గంగోత్రి', 'బద్రీనాథ్'​ సినిమాల్లో కూడా ఈ తరహా సన్నివేశాలు పెట్టారు.

తొలిసారి ఫ్యాక్షనిస్ట్​​ గెటప్​లో..
అప్పటికే 'సమరసింహా రెడ్డి' వంటి ఫ్యాక్షనిస్ట్​ బ్యాక్​డ్రాప్​ చిత్రాలు రిలీజైనా.. చిరూ అప్పటివరకు అలాంటి పాత్రలు చేయలేదు. తొలిసారిగా రాయలసీమ బిడ్డగా కత్తి చేతపట్టి పవర్​ఫుల్​ డైలాగులు కొట్టేసరికి అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. పది కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసు వర్షం కురిపించింది. 175 రోజులు ఆడిన ఈ చిత్రం దాదాపు రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. చిరంజీవి నటన, బీ గోపాల్​ దర్శకత్వం, మణిశర్మ మ్యూజిక్​ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్​గా నిలిచేలా చేశాయి. అప్పట్లో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా కూడా నిలిచింది. హీరోయిన్లుగా నటించిన ఆర్తీ అగర్వాల్​, సోనాలీ బింద్రేలకు కూడా ఈ చిత్రంతో మంచి బ్రేక్​ దక్కింది. 'గ్యాంగ్​ లీడర్'​, 'ఘరానా మొగుడు' తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్​ కోసం ఎదురుచూస్తున్న చిరూ ఈ సినిమాతో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు. అందుకే అటు చిరు, ఇటు అభిమానులకు కూడా ఈ సినిమా చాలా స్పెషల్.

indra
ఇంద్రసేనారెడ్డిగా చిరంజీవి

ఆ డైలాగ్‌లు అలా వచ్చాయి
'ఇంద్ర'లో చిరు నటనతో పాటు పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు ఎంతగానో అలరించాయి. అయితే, తొలుత ఈ సినిమాకు తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడని భారీ డైలాగ్‌లు రాయొద్దని పరుచూరి బ్రదర్స్‌కు సూచించారట చిరు. అయితే, ఆడియో ఫంక్షన్‌లో ‘గురూ డైలాగ్‌.. గురూ డైలాగ్‌’ అని అభిమానులు అరవడంతో చిరంజీవి మనసు మార్చుకుని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రాయాల్సిందిగా కోరారు. అప్పటికి 80శాతం షూటింగ్‌ అయిపోయింది.'మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా' వంటి డైలాగ్‌లు ఆ తర్వాత వచ్చినవే. అలాగే అలహాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుండగా, 'మేనల్లుడి కోసం నేను దెబ్బలు తింటున్నాను సరే. అభిమానులు ఆ సీన్‌ను ఒప్పుకొంటారా' అని పరుచూరి బ్రదర్స్‌ను అడగ్గా, 'తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని' అని డైలాగ్‌ పెట్టారట పరుచూరి బ్రదర్స్‌.

అలాగే చిరంజీవి రాయలసీమకు తిరిగి వచ్చిన తర్వాత కూడా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ కావాలని అడిగారట. అప్పటికప్పుడే సెట్స్‌లో 'రాననుకున్నారా రాలేననుకున్నారా' డైలాగ్‌ రాస్తే, చిరు ముచ్చటపడిపోయి, పరుచూరి గోపాలకష్ణకు సోనీ ఎరికసన్‌ ఫోన్‌ కానుకగా ఇచ్చారు. ఇక క్లైమాక్స్‌ ఫైట్స్‌ సీన్స్‌కు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ సమయంలో విలన్‌ ముఖేష్‌ రుషిని కొట్టిన తర్వాత చిరంజీవి మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాల్సి ఉంది. విలన్‌ను కొట్టేసిన తర్వాత డైలాగ్స్‌ చెబితే బాగుండదని చిరు చెప్పడంతో 'నరుక్కుంటూ వెళ్తే, అడవి అన్నది మిగలదు. చంపుకొంటూ వెళ్తే మనిషి అన్నవాడు మిగలడు' అన్న ఒక్కడైలాగ్‌తో ముగించారు.

  • చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.7కోట్లు. చిరంజీవి, వైజయంతి బ్యానర్ లో మూడో సినిమా.. అంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. ఇక ఇంద్రతో హ్యాట్రిక్ కొట్టి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని నిరూపించారు.
  • మొత్తం 120 రోజుల్లో సినిమాని ఫినిష్ చేశారు. మొత్తం పదకొండు పాటలకి చేయగా అందులో అయిదు పాటలని ఓకే చేశారు. ఇందులో ‘అయ్యో అయ్యో’ సాంగ్‌కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పీ పట్నాయక్ తో మ్యూజిక్ చేయించుకున్నారు.
  • జులై 24, 2002న మొత్తం 268 స్క్రీన్‌లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో 151 కేంద్రాల్లో 50 రోజులు,98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
  • ఈ సినిమాకి మూడు విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు - చిరంజీవి ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ - పి రవి శంకర్
  • ఫస్ట్ వీక్ రూ.40 కోట్ల వసూళ్లూ సాధించిన తొలి తెలుగు సినిమా ఇంద్ర కావడం విశేషం.. ఆ తర్వాత పోకిరి సినిమా దీనిని బ్రేక్ చేసింది.
  • విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి చీఫ్ గెస్ట్. ఈ చిత్రాన్ని హిందీలోకి "ఇంద్ర: ది టైగర్" గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ చేశారు.

ఈ సినిమాలో పాపులర్​ డైలాగులు ఇవే..

  • "షావుకత్​ అలీఖాన్​.. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టీ తల వంచుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడనుంచి తలలు తీసుకెళ్లేవాడిని."
  • "మేము తెనాల్లోలం తెలుసా తెలివితక్కువోళ్లం కాదు".. "తెనాలా! మాది తెనాలే..!"
  • "ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందం తో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారతాయో.. ఆయనే ఇంద్ర సేనా రెడ్డి."
  • "వీరశంకర్​రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా"
  • "రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడలే కానీ ఆశ్చర్యపోతరేంటీ.. రానానుకున్నారా రాలేననుకున్నారా.. కాశికి పోయాడు.. కాషాయ మనిషైపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరసులు మార్చి ఉంటాడు అనుకుంటున్నారా.. అదే రక్తం అదే పౌరుషం."
  • "సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది."

ఇదీ చూడండి: 'ఆ ఆలోచనే 'సీతారామం'.. అందుకే ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ'

తొలిసారి గిరిజన మహిళకు జాతీయ అవార్డు.. ఒక్క పాటతోనే రికార్డు.. ఎవరామె?

Last Updated : Jul 24, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.