100 Crore First Lady Oriented Film: సినీ ఇండస్ట్రీలో ఓ నటుడు లేక ఓ నటి ఎదగాలంటే ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు వారు అనుకున్న ఫలితాలు రాక పోవచ్చు. అయితే వారు నటన కోసం పెట్టే కృషి వారిని గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని ఎంతో మంది స్టార్లు నిరూపించారు. అందులో బాలీవుడ్‌కు చెందిన ఓ నటి కూడా ఉన్నారు. ఒకప్పుడు ఆమె వల్ల సినిమా ఆగిపోయిందని భావించి ఓ సినిమా నిర్మాత ఆమెను ఐరన్ లెగ్ అంటూ అవమానించారు. దీంతో ఆమెను దురదృష్టకరంగా భావించిన ఇతర నిర్మాతలు అప్పటి వరకు ఆమె చేతిలో ఉన్న 12 సినిమాల నుంచి తొలగించారు. అయితే ఆ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్లో రాణిస్తున్నారు. అగ్ర తారలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ?
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. సీరియల్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ స్టార్ హీరోయిన్ ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు. తెలుగులో ఒక్క సినిమాలోనే నటించినప్పకీ ఆమెకు సౌత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ నటి కెరీర్ ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెకు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ సరసన 'చక్రం' అనే చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చింది.
అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ చిత్ర నిర్మాత దీనికి విద్యబాలనే కారణమంటూ ఆమెను నిందించారు. దీంతో ఈమెతో సినిమా తీస్తే దురదృష్టమని భావించి వేరే చిత్రాల ప్రొడ్యూసర్లు అప్పటికే ఒప్పుకున్న 12 చిత్రాల నుంచి ఆమెను తొలగించారు. ఇలా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యాబాలన్ ఏ మాత్రం నిరాశ చెందలేదు. నటనతో తనను తాను మెరుగుపరుచుకుంటూ దూసుకెళ్లారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Vidya Balan Career: 2003లో బెంగాలీ చిత్రం 'భలో తేకో'తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్య, 2005లో 'పరిణిత'తో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత నుంచి తనకు వెనుక్కి చూడాల్సిన అవసరం రాలేదు. 'లగేరహో మున్నాభాయి', 'గురు', 'హే బేబీ', 'భూల్ భులయ్య' లాంటి సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. వీటితో పాటు ఆమె నటించిన మరిన్ని చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఆమె లీడ్ రోల్ లో నటించిన 'డర్టీ పిక్చర్' అప్పటి వరకూ ఉమెన్ లీడ్ రోల్లో వచ్చిన సినిమాల రికార్డులు తిరగరాసి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో పాటు తనకు ఉత్తమ జాతీయ అవార్డును అందించింది. ఒకప్పుడు దురదృష్టమని 12 చిత్రాలనుంచి తొలగించిన నటి ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిలలో ఒకరుగా రాణిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఒక చిత్రానికి రూ. 7 కోట్లు తీసుకుంటున్నారట!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
17 ఏళ్లకే జాతీయ అవార్డ్ - తనకన్నా 26 ఏళ్ల పెద్ద వ్యక్తితో పెళ్లి, ఆపై సూసైడ్ - ఎవరా నటి?