ETV Bharat / elections

వివాదాల 'సాధ్వి' సంచలనాలు సృష్టిస్తారా? - భోపాల్

హిందుత్వం.. భాజపా ప్రధాన ఎన్నికల అస్త్రం. 2 సీట్ల నుంచి దేశాన్ని ఏలే స్థాయికి తెచ్చింది ఆ హిందుత్వవాదమే. ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భాజపా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే మాలెగావ్​ కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్​ను తెరపైకి తీసుకొచ్చింది కాషాయ పార్టీ. భోపాల్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​సింగ్​పై పోటీకి దించింది. సాధ్వితో భాజపా చేస్తున్న ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి!

వివాదాల 'సాధ్వి' సంచలనాలు సృష్టిస్తారా?
author img

By

Published : Apr 25, 2019, 6:32 AM IST

వివాదాల 'సాధ్వి' సంచలనాలు సృష్టిస్తారా?

ఎన్నికలు అంటేనే ప్రయోగాల సమాహారం. సమయం బట్టి, ప్రత్యర్థుల ఎత్తులకు అప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తుంటాయి పార్టీలు. ఇందులో భాగంగా కొత్త వ్యక్తులూ హఠాత్తుగా ప్రత్యక్షం అవుతుంటారు. అలానే భాజపా ఓ వ్యక్తిని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించింది. వారే మాలెగావ్​ బాంబు పేలుళ్ల కేసు నిందితురాలిగా జైలు జీవితం గడిపిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.

సరైన సందర్భంలో తెరపైకి..

భోపాల్​.. భాజపా కంచుకోటల్లో ఒకటి. 8 పర్యాయాలుగా ఓటమన్నదే ఎరుగదు. ఈసారీ గెలుపుపై భాజపాకు అనుమానాలు లేవు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్​ సింగ్​ పేరు ప్రకటనతో కొత్త వ్యూహాలవైపు భాజపా మొగ్గు చూపింది. హిందుత్వం, ఆర్​ఎస్​ఎస్​లను భాజపాకు ముడిపెట్టి విమర్శించటంలో డిగ్గీరాజాకు పెట్టింది పేరు. హిందూ, కాషాయ తీవ్రవాదమనే పదజాలంతో భాజపాను ఉటంకించేవారు.

హిందుత్వంపై ఐదేళ్ల కాలంలో తమపై వచ్చిన విమర్శలకు సమాధానంగా భాజపా ప్రయోగించిన అస్త్రమే సాధ్వి ప్రజ్ఞా సింగ్. భోపాల్​ స్థానంలో సాధ్విని బరిలో దించడం అంటే ఒకే వేదికగా రెండు ప్రయోజనాల కోసమే. కంట్లో నలుసులా మారిన దిగ్విజయ్​ ఓడించొచ్చు. రెండోది... సాధ్వి గెలుపుతో హిందుత్వంపై వస్తున్న విమర్శలను పటాపంచలు చేయొచ్చు. సాధ్వికి టికెట్​తో రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఓటర్లు భాజపా వైపు మళ్లుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

వివాదాలతోనే ఆరంభం

భాజపా వ్యూహాలకు తగ్గట్టే సాధ్వి ప్రజ్ఞా కూడా వ్యక్తిగతంగా దూకుడు పెంచారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పదునైన పదాలతో ఎన్నికల సమరంలో వేడి పుట్టిస్తున్నారు. 2008 ముంబయి దాడుల్లో అమరులైన పోలీసు అధికారి హేమంత్​ కర్కరే.. తనను హింసించిన శాపం వల్లే ప్రాణాలు కోల్పోయారన్న వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈసీ ఆగ్రహంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అంతలోనే బాబ్రీ ఘటనలో పాల్గొన్నందుకు గర్విస్తున్నట్లు మరో బాంబు పేల్చారు. ఈసారి ఈసీ ఆదేశాలతో ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

సాధ్వి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలన్నీ ముందస్తు ప్రణాళికల ప్రకారమే జరుగుతున్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపి హిందూ వర్గం ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగమని విమర్శిస్తున్నారు.

అయోధ్య తర్వాత సాధ్వి ప్రజ్ఞాసింగ్​ కేంద్రంగా మళ్లీ ఆ స్థాయిలో హిందుత్వ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది భాజపా. ఆమె గెలుపు ద్వారా తమపై విమర్శలకు చెక్​ పెట్టడం, హిందుత్వ నినాదానికి ప్రజామోదమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలతో వెళుతోంది. భాజపా వ్యూహాలను ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారనేది తేలాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే.

Kollam (Kerala), Apr 16 (ANI): Congress president Rahul Gandhi on Tuesday said that he chose to fight from Kerala, other than his traditional Amethi Lok Sabha seat, because he wanted to give a message that 'India is not just one perspective' rather it is 'millions and millions of different viewpoint' which are 'important' for the country. "I normally fight the election from Amethi in north India but this time I chose to give a message to south India by fighting from Kerala. I wanted to give a message that India is not just one perspective, India is not just one idea, India is million and millions of different viewpoint, different perspectives and all of those are important to us," Gandhi said at a public rally in Kerala's Kollam.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.