ETV Bharat / elections

భారత్​ భేరి: 'శబరిమల' అస్త్రం ఫలించేనా?

కేంద్రంలో మరోమారు అధికారం... భాజపా లక్ష్యం. అలాంటివి మరికొన్ని ఉన్నాయి. దక్షిణాదిన పట్టు సాధించడం. ముఖ్యంగా... కేరళలో ఖాతా తెరవడం. మలయాళ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క సీటైనా గెలవలేదు కమలదళం. ఈసారి మాత్రం చరిత్ర మార్చగలమని విశ్వసిస్తోంది. శబరిమల వివాదం ఇందుకు ఉపకరిస్తుందని ఆశిస్తోంది.

భారత్​ భేరి: 'శబరిమల' అస్త్రం ఫలించేనా?
author img

By

Published : Apr 20, 2019, 7:45 PM IST

కేరళలో ఖాతా తెరవడం కోసం భాజపా విశ్వ ప్రయత్నం

కేరళలో గెలుపైనా... ఓటమైనా ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్ కూటములదే. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా... అధికార, ప్రతిపక్ష హోదాలు ఆ రెండింటివే. జాతీయ పార్టీ అయిన భాజపాది అక్కడ అస్తిత్వ పోరాటమే. ఇప్పుడు పరిస్థితి మారింది. కమల దళానికి సరికొత్త ఆయుధం చిక్కింది. శబరిమల వివాదమే... ఎన్నికల అస్త్రమైంది.

పతనంతిట్ట... కేరళలోని ఓ జిల్లా. దేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉండే ప్రాంతంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిన జిల్లా. రాష్ట్రంలో అతి తక్కువ పేదరికంతో విద్య, ఉద్యోగ, ఆదాయాల్లో దూసుకెళ్తోంది పతనంతిట్ట. 96.55 శాతం అక్షరాస్యత కలిగి ఉంది. ప్రఖ్యాత దేవాలయం శబరిమల ఉన్నది ఈ జిల్లాలోనే.

రాజకీయ ముఖచిత్రం...

పతనంతిట్ట లోక్​సభ నియోజకవర్గంలో పొటీ ఎప్పుడూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలోని యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​, సీపీఎం నేతృత్వంలోని లెఫ్టిస్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​ మధ్యే. గత రెండు లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు చెందిన ఆంటోని విజయం సాధించారు.

బరిలోకి భాజపా...

శబరిమల ఆలయ వివాదంతో పతనంతిట్ట రాజకీయ ముఖచిత్రం మారింది. అన్ని వయసుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడూ రెండు కూటముల మధ్య ఉండే పోటీ త్రిముఖం అయింది. ఆలయ సంస్కృతి, ఆనవాయితీనే ప్రచారాస్త్రాలుగా చేసుకొని తెరపైకి భాజపా వచ్చింది. హిందూ సంస్కృతి, ఆచారాలను కాపాడేది మోదీ ప్రభుత్వమేనంటూ బరిలోకి దిగింది.

కమలం ఆశలు ఆ ఒక్కరిపైనే...!

కె. సురేంద్రన్... పతనంతిట్ట భాజపా ప్రధాన కార్యదర్శి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు ఆయన. విజయన్​ ప్రభుత్వం ఆలయ సంస్కృతిని కాలరాస్తోందంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సురేంద్రన్​పై పలు కేసులు నమోదు చేశారు రాష్ట్ర పోలీసులు. ఒకసారి అరెస్టు చేశారు.

భక్తులు, ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలతో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సురేంద్రన్​కు పతనంతిట్ట లోక్​సభ టికెట్​ ఇచ్చింది భాజపా. ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు తమ విజయం ఎంతో అవసరమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది.

హాట్రిక్​ లక్ష్యంగా ఆంటోని...

2009, 2014 లోక్​సభ ఎన్నికల్లో యూడీఎఫ్​ తరఫున కాంగ్రెస్​ నేత 'ఆంటో ఆంటోని'ని పతనంతిట్ట లోక్​సభ స్థానం నుంచి గెలిపించారు ప్రజలు. 2014 ఎన్నికల్లో 41శాతం ఓట్లతో 56వేలకుపైగా మెజార్టీ అందించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

ఎల్​డీఎఫ్​ తరఫున జర్నలిస్ట్...

ఎల్​డీఎఫ్​ తరఫున సీపీఎం నేత వీణా జార్జ్​ బరిలో నిలిచారు. 16 ఏళ్ల పాటు పలు ప్రముఖ మలయాళీ వార్తా సంస్థల్లో సేవలందించిన వీణా ప్రస్తుతం ఆరన్​ముల శాసనసభ్యురాలు. ఎంపీగా గెలిస్తే పంబా నది ప్రక్షాళనతో పాటు, ఎరుమేలికి విమానాశ్రయాన్ని తీసుకొస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. కాంగ్రెస్​, భాజపా అభ్యర్థులకు దీటైన పోటీ ఇస్తాననే విశ్వాసంతో ఉన్నారు వీణా జార్జ్.

"లోక్​సభ ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ చరిత్ర సృష్టిస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రజలే ఇందుకు నిదర్శనం."

- వీణా జార్జ్​, పతనంతిట్ట ఎల్​డీఎఫ్​ అభ్యర్థి

నాయర్లే కీలకం!

శబరిమల ఉద్యమాన్ని నడిపించింది నాయర్ల వర్గానికి ప్రాతినిధ్యం వహించే 'నాయర్​ సర్వీస్​ సొసైటీ'. ఇక్కడ వీరి ప్రాబల్యం ఎక్కువే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మూడు పార్టీలకు ఎన్​ఎస్​స్ దూరంగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. తుది నిర్ణయం ఎవరివైపు ఉంటుందన్నది ఆసక్తికరం.

దిద్దుబాటు చర్యలు...!

మహిళలకు ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయడం కారణంగా భక్తుల్లో పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు ముఖ్యమంత్రి విజయన్​. జిల్లా అభివృద్ధికి రూ.739కోట్లు, ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు అభివృద్ధికి మరో రూ.100కోట్లు కేటాయించారు.

20 లోక్​సభ నియోజకవర్గాలున్న కేరళలో ఏప్రిల్​ 23న పోలింగ్​. మే 23న ఫలితం.

Amritsar (Punjab), April 20: Millions of devotees joined hands to perform Kar Sewa at the famous Durgiana Temple in Punjab's Amritsar city. The Kar Sewa or cleaning the temple in Amritsar is happening after 20 long years and the devotees expressed joy at taking part in it and called for others to take part as well. People from all castes and community took part in the drive in numbers and not only offered prayer at the temple, but also took part in the Kar Sewa to clean it so that it can incorporate better facilities with new infrastructure. While in the first phase of Kar Sewa, the temple premises were cleaned by the devotees, in the second phase, renovation and beautification of the sarovar has been carried out. The plan for the future is to redevelop the Durgiana Temple on the lines of the Golden temple, the most revered Sikh Shrine of the country. Auditorium, corridors, heritage street, musical fountain and laser show among others are to be incorporated into the temple area.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.