ETV Bharat / crime

పీడీఎస్ బియ్యం పట్టివేత.. అదుపులోకి నిందితులు

సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో రెండు లారీలతో సహా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Zaheerabad Civil Supplies Department officials and police seized 550 quintals of ration rice being smuggled in Sangareddy district
పీడీఎస్ బియ్యం పట్టివేత.. అదుపులోకి నిందితులు
author img

By

Published : Feb 14, 2021, 4:06 AM IST

సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 550 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోని చౌక దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించేందుకు రెండు లారీల్లో తీసుకెళ్తున్నారు.

జహీరాబాద్ బైపాస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యంతో సహా.. రెండు లారీలను సీజ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గిడ్డంగికి తరలించారు.

ఇదీ చదవండి:విషాదం : రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.