ETV Bharat / crime

Viveka murder case: వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతం - తెలంగాణ వార్తలు

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 64వరోజు విచారణ కొనసాగుతోంది. పులివెందులకు చెందిన ఎనిమిది మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Viveka murder case, cbo investigation
వివేకా హత్యకేసు, సీబీఐ విచారణ ముమ్మరం
author img

By

Published : Aug 9, 2021, 1:47 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాగంగా 64వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో విచారణ జరుపుతున్నారు. ఇవాళ పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, సంపత్, నీలయ్య, శ్రీనివాస్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దక్కని ఫలితం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం ఆదివారం అన్వేషణ చేపట్టారు. పులివెందుల రోటరీపురం వాగులో మురికినీరు తొలగించి అన్వేషణ చేశారు. యంత్రాలతో మట్టి తొలగించి గాలించినా ఫలితం దక్కలేదు. రోటరీపురంవాగును మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు.

విచారణ ముమ్మరం

ఆంధ్రప్రదేశ్​వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో (Viveka murder case) కీలక నిందితుడిగా ఉన్న సునీల్​ యాదవ్​ను సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు తీసుకెళ్లారు. పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహించారు.

ఇంట్లో తనిఖీలు

వివేకా ఇంటి పరిసరాల్లో సీబీఐ అధికారులు ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.

రంగన్న వాంగ్మూలం కీలకం

కేసు దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి కాపలదారు రంగన్నను సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. చివరికి ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. సుమారు 45 నిమిషాలపాటు వాంగ్మూలం నమోదు చేసింది. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వివరించారని ప్రచారం జరిగింది. తన పేరు ఎవరికైనా చెబితే నరికి చంపుతానని ఎర్రగంగిరెడ్డి బెదిరించారని.. అందుకే తాను భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదని రంగన్న తెలిపారు. సీబీఐ అధికారులు తనపై ఈగ వాలనివ్వబోమని హామీ ఇచ్చినట్లు వివరించారు.

వివేకా హత్యకేసు ఛేదించడానికి సీబీఐ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. పులివెందులలో అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.