Young Woman Murdered in AP: ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి ఎన్టీఆర్ కట్టపై దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో దాడి చేసి యువతిని హత్య చేశాడు. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. రాజు అనే యువకుడు తరచు గంజాయి సేవించి రోడ్డుపై వెళ్తున్న యువతులను, మహిళలను వేధించేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఓ అంధ యువతిని ఆదివారం గంజాయి మత్తులో వేధించాడు.
రాజు వేధింపులకు భయాందోళనకు గురైన యువతి అక్కడినుంచి ఇంటికి వెనుదిరిగింది. అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో రాజు ఆ యువతి ఇంటికి గంజాయి మత్తులో వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆంధ యువతి తీవ్రంగా గాయపడింది. రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని యువతి బంధువులు వెల్లడించారు.
రాజు తరచు గంజాయి సేవించి మహిళలను వేధిస్తున్నారని.. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఘటన జరిగి ఉండేంది కాదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు అంటున్నారు. సోమవారం రాజు పోలీసులకు లొంగిపోయాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
"మా అమ్మాయి ఇంటి దగ్గర ఉంటే వచ్చి రాజు అనే యువకుడు చాలా దారుణంగా ప్రవర్తించాడు. పిల్లలపైనే ఎక్కడ పడితే అక్కడ చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. మా అమ్మాయితో ఏమి నన్ను పట్టంచుకోలేదు అని అంటూ వేధించాడు. అక్కడే మా కూతురిని చంపేశాడు. నేరుగా పోలీసు స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నా కూతురు చనిపోయింది." - యువతి తల్లి
ఇవీ చదవండి :