హైదరాబాద్ శివారులోని మైలార్ దేవ్‌పల్లి లక్ష్మీ గూడలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీషియన్‌గా పని చేస్తున్న యువతి సోమవారం రాత్రి తన గదిలో సీలింగ్ రాడ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతి మృతితో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానిక యువకుడు వేధించడంతోనే యువతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: 'లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం'