ETV Bharat / crime

ప్రేయసి వేరే వ్యక్తిని ప్రేమించిందని.. ఆడియో రికార్డ్ చేసి..! - తెలంగాణ వార్తలు

తాను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమించడం తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు ఓ యువకుడు. ఈనెల 15న నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లి గ్రామానికి చెందిన సుధీర్ బెహ్రెయిన్‌లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

young man suicide for love, nizamabad young man suicide
ప్రేమ కోసం యువకుడు ఆత్మహత్య, బెహ్రాన్‌లో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Mar 27, 2021, 3:04 PM IST

ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి బలవన్మరణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామానికి చెందిన సుధీర్ అనే యువకుడు బెహ్రెయిన్‌లో ఉరివేసుకున్నాడు. ఈ నెల 15న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి వల్లే తాను చనిపోతున్నట్లు వాట్సాప్‌లో ఆడియో రికార్డ్ చేశాడు. ఆ ఆడియోని స్నేహితులకు షేర్ చేశాడు. సుధీర్ మృతదేహాన్ని బెహ్రెయిన్‌ నుంచి తీసుకువచ్చి శవపరీక్ష కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా... పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: మన సంస్కృతి, సంప్రదాయాన్ని విస్మరిస్తున్నాం: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.