YOUNG MAN DIED : ఆన్లైన్లో అవసరాలకు డబ్బులు తీసుకోవడం.. అవి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం సహజమైంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు ఆన్లైన్ రుణాలు తీసుకోవద్దని సూచించినా.. అవసరానికి తీసుకుని వాటిని తిరిగి కట్టలేక మానసిక సంఘర్షణకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా రుణయాప్‌ల ఒత్తిడి, క్రికెట్ బెట్టింగ్ రెండు కలిసి ఓ యువకుడిని బలి తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్‌కు చెందిన రోహిత్ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన కుంటుబ సభ్యులు పిన్నమనేని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోహిత్ మృతికి క్రికెట్ బెట్టింగ్, లోన్ యాప్‌లే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగినట్టు ఏ తల్లిదండ్రులకూ జరగకూడదని.. పోలీసులు, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని తండ్రి రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: