ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని బాలికపై.. యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి అత్త కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం! చిన్నప్పుడే.. తండ్రి చనిపోయిన ఆమె.. ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటోంది. మైనర్ ఇంటికి దగ్గరలోనే మేనత్త ఉంటోంది. అప్పుడప్పుడూ బాలిక వారింటికి వెళ్లేది. బాలికపై మేనత్త కొడుకైన శివ కన్ను పడింది. ఈ నేపథ్యంలోనే.. ఇటీవలే వారింటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పలేకపోయింది.
బాలికకు రక్తస్రావం అవుతుండటంతో.. గుర్తించిన తల్లి ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. వెంటనే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీయగా.. బాలిక అత్త కొడుకు శివనే అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: Hyderabad Hotel news: ఓ హోటల్ నిర్వాకం.. మటన్‌లో బూజు.. చికెన్‌లో పురుగులు!