Telangana young man died in Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో సోనామార్గ్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో గుర్తు తెలియని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మృతి చెందిన యువకుడు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన కంచర్ల సృజన్గా పోలీసులు గుర్తించారు. సీఆర్పీసీ 174 కింద కేసు నమోదు చేసుకొన్న కశ్మీర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: