ETV Bharat / crime

SELFIE CRAZE: సెల్ఫీ దిగుతూ.. ప్రవాహంలో పడి యువకుడు మృతి

అలుగు వద్ద సెల్ఫీ దిగుతూ... ప్రవాహంలో పడి యువకుడు మృతి చెందిన ఘటన పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి... మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

SELFIE CRAZE
యువకుడు మృతి
author img

By

Published : Sep 6, 2021, 11:09 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు.. నీటి ప్రవాహంలో జారి పడి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్​లోని కడపకు చెందిన రాజేష్... హైదరాబాద్​లోని సురారంలో నివాసముంటున్నాడు.

ఆదివారం కావటంతో.. బంధువులతో కలిసి లఖ్నాపూర్​ ప్రాజెక్టు వద్దకు విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ దృశ్యాలను చరవాణీలో బంధించి... సెల్ఫీలు తీసుకుంటున్నారు. నలుగురు కలిసి ప్రాజెక్టు అలుగు వద్ద.. సెల్ఫీ దిగేందుకు వెళ్లి.. నీటి ప్రవాహంలో జారి పడ్డారు. అక్కడే ఉన్న జాలర్లు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలోకి దిగి ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించారు. రాజేష్ మాత్రం నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అలుగు పారుతున్న ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సెల్ఫీల మోజులో పడి... ప్రమాదంలో పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: Be Alert: వర్షంలో పారాహుషార్​... పొంచి ఉన్న విద్యుత్తు ప్రమాదాలు

సరదాగా వాగుకు వెళ్లిన ఇద్దరు.. వరద ఉద్ధృతికి గల్లంతు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.