ETV Bharat / crime

విద్యుత్​ షాక్​కు యువకుడు బలి.. సీసీ కెమెరాలో దృశ్యాలు.. - Young man died electric shock

Young man died with electric shock: విద్యుత్​ షాక్​ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్​ నగరంలో జరిగింది. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో విద్యుత్​ ఘాతుకానికి యువకుడు బలైయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి.

electric shock
విద్యుత్​ షాక్​
author img

By

Published : Sep 13, 2022, 7:16 PM IST

Young man died with electric shock: పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో విద్యుత్​ షాక్​ తగిలి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని సిటీ ఆర్ట్స్​ షాప్​లో చోటుచేసుకుంది. స్థానికులు ప్రమాదం సంభవించిన వెంటనే యువకుడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అప్పటికే యువకుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విద్యుత్​ షాక్​తో మృతి చెందిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

హైదరాబాద్​ నగరంలోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన చిట్టమొని అభిలాష్ యాదవ్ అదే ప్రాంతానికి చెందిన సిటీ ఆర్ట్స్ షాప్​లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు లాగే యధావిధిగా యజమాని చెప్పిన పనులు చేస్తున్నాడు. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో విద్యుత్​ షాక్​ తగిలి అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. స్థానికులు విద్యుత్​ను నిలుపుదల చేసి హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. యువకుడు అప్పటికే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు.

విద్యుత్​ షాక్​ తగిలి యువకుడు మృతి చెందిన దృశ్యాలు

గతంలోనూ ఈ యువకుడు ఇలాగే ఒకసారి విద్యుత్ ఘాతుకానికి గురై షాక్ నుంచి బయటపడినట్లుగా స్థానిక ఉద్యోగులు తెలిపారు. పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. షాపు యజమానిని స్థానిక రాజేంద్రనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.