ETV Bharat / crime

accident: ఉద్యోగం కోసం బయల్దేరి అనంతలోకాలకు!

ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఉద్యోగం కోసం బయల్దేరిన ఆ యువకుడు అనంతలోకాలకు చేరాడు. అరవింద్ అనే యువకుడు సోమవారం నాడు అపోలో ఆస్పత్రికి ఇంటర్వ్యూ కోసం బైక్​ మీద వెళ్తుండగా ట్రాక్టర్ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Jun 8, 2021, 10:05 AM IST

road accident, young man dead in accident
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, బైక్​ను ఢీకొన్న ట్రాక్టర్

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా ఎంబీబీఎస్​ పూర్తి చేసిన ఓ యువకుడు మృత్యువాత పడ్డ ఘటన హైదరాబాద్​లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్వ్యూ కోసం తన సోదరుడితో అపోలో ఆస్పత్రికి వెళ్తున్న అరవింద్ అనే యువకుడిని ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్ కళాసిగూడాకు చెందిన అజిత్, అరవింద్​ ఇద్దరు అన్నదమ్ములు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం అపోలో ఆస్పత్రికి సోమవారం బయల్దేరగా… బేగంపేట ఫ్లైఓవర్ వద్ద వారి ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

బైక్​ వెనుక ఉన్న అరవింద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో అతని సోదరుడు అజిత్​కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ వదిలేసి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కారు, ట్రాక్టర్ ఢీ.. డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.