భువనగిరి శివారులోని రాచకాల్వ బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని జలాల్పురకు చెందిన కిశోర్, సుకన్య దంపతుల కుమారుడు... రవితేజ(22) గా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరు స్థానికంగా మాంసం దుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఘటన బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగి ఉంటుందని భువనగిరి రైల్వే పోలీసులు పేర్కొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రవితేజ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 'మోదీజీ ప్రసంగాలు కాదు.. పరిష్కారం చెప్పండి'