హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీపక్ అనే యువకుడు శనివారం సాయంత్రం దోబీఘాట్ వద్ద ఉన్న పాత బావి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో తన తండ్రి చంద్రయ్యకు ఫోన్ చేసి... ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే బావి వద్దకు వెళ్లి చూసిన తండ్రికి... కుమారుడి చెప్పులు మాత్రమే కనిపించాయి.
వెంటనే సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించినట్లు చంద్రయ్య తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల కోరికకు వ్యతిరేకంగా... ఇటీవలే నగరానికి చెందిన ఓ యువతిని దీపక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో కరోనా గర్భిణీ ప్రసవం