ETV Bharat / crime

ప్రేమించి పెళ్లి చేసుకుని.. వీడియోలు తీసి బెదిరింపులు - cheating lover

Cheating in the name of love: ప్రేమించి పెళ్లి చేసుకొని కలిసున్న సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలు చూపి.. డబ్బులివ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడు. నిఖిల్ రూ.4 లక్షల వరకు పలు దఫాలుగా బాధితురాలి నుంచి తీసుకున్నాడు.

Crime News
Crime News
author img

By

Published : Oct 30, 2022, 10:03 AM IST

Cheating in the name of love: ప్రేమించి పెళ్లి చేసుకొని కలిసున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ప్రబుద్ధుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ(26) నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుంది.

ఆమెకు నిఖిల్‌(25) పరిచయమై.. ప్రేమిస్తున్నానని నమ్మించి గతేడాది నవంబరులో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలపాటు ఎవరింట్లో వారున్న తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కలిసి ఉంటున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్న నిఖిల్‌.. మద్యానికి బానిసై డబ్బు కోసం భార్యను వేధించేవాడు.

రూ.4 లక్షల వరకు పలు దఫాలుగా బాధితురాలి నుంచి తీసుకున్నాడు. ఇటీవల ఇద్దరూ కలిసున్న సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలు చూపి.. డబ్బులివ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు శనివారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.