ETV Bharat / crime

యువకుడు అదృశ్యం.. రుణయాప్​ల వేధింపులే కారణం! - crime news

Loan App Young Man Missing: రుణ యాప్​ల వేధింపులను భరించలేక యువకుడు అదృశ్యమయ్యాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్​ ద్వారా సందేశం పంపాడు. ఇతని ఆచూకీ గురించి పోలీసులు గాలిస్తున్నారు.

loan app
లోన్​ యాప్​
author img

By

Published : Jan 3, 2023, 10:26 PM IST

Loan App Young Man Missing: రుణ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చనిపోతానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. హైదరాబాద్ బోరబండ ఎస్సార్​నగర్​కు చెందిన మహ్మద్ అబ్దుల్ మతిన్.. డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30న బేగంపేటకు వెళ్తున్నానని చెప్పి.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతనికి పలుమార్లు ఫోన్ చేశారు.

మధ్యాహ్నం సమయంలో ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసినప్పటికీ.. రాకుండా తన సోదరుడికి ఓ ఎస్​ఎమ్​ఎస్ పంపాడు. రుణ యాప్ నిర్వాహకుల ఒత్తిడి భరించలేకపోతున్నానని, తాను చనిపోతానంటూ ఆ సందేశంలో పేర్కొన్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతని కోసం వెతికిన కుటుంబ సభ్యులు.. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.