ETV Bharat / crime

ప్రేమకు అడ్డువస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య..! - nirmal crime news

love issue: ప్రేమించిన అమ్మాయి మరొకరితో ప్రేమగా మెలగడం చూసి.. ఓ యువకుడు ఓర్చుకోలేకపోయాడు. అతనిని ఎలా అయినా అడ్డు తొలగించి.. అమ్మాయికి దగ్గరవ్వాలని దారుణానికి ఒడిగట్టాడు. అమ్మాయి చనువుగా మెలుగుతున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలోని దిలావర్​పూర్​లో చోటు చేసుకుంది.

young man brutally murder
యువకుడి దారుణ హత్య
author img

By

Published : Feb 3, 2022, 12:37 PM IST

love issue: నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌కు చెందిన ఖయ్యుం అనే వ్యక్తి నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు. లోకేశ్వరం మండలం గడ్‌చాందకు చెందిన మంద ప్రసాద్‌ అనే యువకుడు నిర్మల్‌లోనే ఉంటూ మరో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే యువతితో ఇతడికి పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.

మరొకరితో చనువుగా ఉంటొందని...

yoing man murdered: ఇద్దరూ చనువుగా ఉంటున్న విషయం తెలిసిన ఖయ్యుం తరచూ ప్రసాద్‌తో గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లిన ఖయ్యుం, అక్కడ ఆమె లేకపోవడంతో కాసేపు ఎదురుచూశాడు. వచ్చాక ఆమెతో గొడవపడ్డాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న ప్రసాద్‌ అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఖయ్యుం తనవెంట తెచ్చుకున్న కత్తితో అతడి గుండెలో పొడిచి అక్కడ్నుంచి పరారయ్యాడు.

చికిత్స పొందుతూ మృతి

అపస్మారక స్థితిలో ఉన్న ప్రసాద్‌ని మిత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు నిందితుడిని బుధవారం స్థానిక సోఫినగర్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. తక్కువ వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌, దిలావర్‌పూర్‌ ఎస్సై, స్థానిక పోలీసు సిబ్బందిని డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి అభినందించారు.

ఇదీ చూడండి: Married Women Suicide: వరకట్న వేధింపులకు గర్భవతి, 18 నెలల పాప బలి..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.