సంగారెడ్డి జిల్లా అమీన్పూర్కు చెందిన అక్రమ్ బిన్ అహ్మద్ బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఏ పని చేయకుండా జల్సాల కోసం డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. యువతులు, మహిళల ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్లతో పరిచయాలు పెంచుకుని ఫోన్లో చాట్ చేస్తూ, వీడియో కాల్ మాట్లాడేవాడు. వారితో సన్నహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకునేవాడు.
అనంతరం డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబసభ్యులకు పంపిస్తానని బెదిరించేవాడు. ఇలా ఓ మహిళనుంచి రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఇంకా కావాలని బెదిరించడంతో ఆమె అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: నడివయసులో నిద్రలేమితో డిమెన్షియా ముప్పు!