ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అలియాస్ టోనీ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే చదువు మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017లో గొలుసు చోరీలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు.
ఇతడికి షేర్‌చాట్ ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తితో 2020లో పరిచయమైంది. తన పేరు ప్రశాంత్‌రెడ్డి అని, హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్నానని, అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌కు ఆశ చూపాడు. తన తల్లి వైద్యం కోసమని డబ్బులు అడిగాడు. శ్రీనివాస్ తన తల్లి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లి ఇచ్చాడు. తర్వాత శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించలేదు. జులై 29న ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తీగ లాగితే.. డొంక కదిలింది..
కడప, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లో ఫేస్‌బుక్, షేర్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, మధ్య వయసు మహిళలతో పరిచయం పెంచుకుని వారికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించేవాడు. వారితో చాటింగ్ చేస్తూ వారి నగ్న, అర్ధనగ్న చిత్రాలను, వీడియోలను సేవ్ చేసుకుని, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేసేవాడు. లేదంటే నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడు. అలా సుమారు 200 మంది యువతులు, 100 మంది మహిళలను మోసం చేశాడు. అతని ఫోన్లో అన్నీ మహిళలు, అమ్మాయిల చిత్రాలే ఉన్నాయని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు.
ఇవీ చూడండి: fake police: తల్లిని సంతోష పెట్టాలని కానిస్టేబుల్ వేషం.. చివరకు ఏమైందంటే..