ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలవపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు జానికిరామ్(25) పొలానికి నీరు పెట్టేందుకు.. అర్థరాత్రి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ ఏనుగు.. అతనిపై దాడి చేసింది.
యువకుడు గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ జానకిరామ్.. పొలంలోనే ప్రాణాలు వదిలాడు. జానకిరామ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుని మృతితో.. అతని తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.
ఇదీ చదవండి: అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు