ETV Bharat / crime

YCP Leader Hulchal In Guntur : 'నాది అధికార పార్టీ.. నా ట్రాక్టర్​నే సీజ్ చేస్తారా?' - వైకాపా నేత హల్​చల్

YCP Leader Hulchal In Guntur : 'నాది అధికార పార్టీ.. నా ట్రాక్టర్​నే సీజ్ చేస్తారా' అంటూ వైకాపా నేత ఓ పోలీస్ స్టేషన్​ వద్ద హల్​చల్ సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ వీడియో కథ ఏంటి..?

YCP Leader Hulchal In Guntur
YCP Leader Hulchal In Guntur
author img

By

Published : Dec 23, 2021, 9:25 AM IST

నాది అధికార పార్టీ.. నా ట్రాక్టర్​నే సీజ్ చేస్తారా

YCP Leader Hulchal In Guntur : పోలీస్ స్టేషన్​లో వైకాపా నేత హల్​చల్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. వైకాపా నేత మద్యం సేవించి గందరగోళం సృష్టించిన.. ఆ వీడియో నెల రోజుల క్రితం నాటిదని పోలీసులు చెబుతున్నారు.

YCP Leader Hulchul : ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేసినందుకు.. వైకాపా నాయకుడు పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణలో గందరగోళం సృష్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతి వాసి లక్ష్మీనారాయణకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు.

ఈ క్రమంలో మద్యం తాగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మీనారాయణ హడావుడి చేశాడు. అధికార పార్టీలో ఉన్న తన వాహనాన్నే సీజ్‌ చేస్తారా? అంటూ.. హల్‌చల్‌ చేశాడు. నేలపై దొర్లాడుతూ.. రచ్చ చేశాడు. పోలీసులు తనను అవమానించారని.. దీని కంటే చనిపోవడమే మేలంటూ కేకలు వేశాడు.

పోలీసులు సముదాయించినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులపై దూషణలకూ దిగాడు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.