ETV Bharat / crime

కౌన్సిలర్​ అరాచకం.. బుల్లితెర నటుడు చాన్ బాషాపై దాడి - జంగారెడ్డిగూడెంలో వైకాపా కౌన్సిలర్ లావణ్య హల్​ చల్​

YCP Councilor Lavanya attack: ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. గాయపడిన చాన్​ బాషాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఓ స్థలం విషయంలో చాన్ భాషా, కౌన్సిలర్ మధ్య నెలకొన్న వివాదం.. దాడికి దారి తీసింది.

ycp-councilor-lavanya-attack-chan-basha-at-jangareddygudem-in-eluru-district

author img

By

Published : Jun 22, 2022, 8:22 PM IST

వైకాపా కౌన్సిలర్​ అరాచకం.. బుల్లితెర నటుడు చాన్ బాషాపై దాడి

YCP Councilor Lavanya attack: ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై స్థానిక 28వ వార్డు వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. వార్డు పరిధిలోని డాంగే నగర్​లోని ఓ స్థలం విషయంలో చాన్ భాషా, కౌన్సిలర్ మధ్య వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్​లో ఉన్న చాన్​ బాషా.. తన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకొని జంగారెడ్డిగూడెం వచ్చారు. ఈ క్రమంలో తన స్థలాన్ని కొందరు ఆక్రమించారంటూ కౌన్సిలర్ ప్రస్తావన తీసుకురావడంతో ఆమె వెనుక నుంచి చాన్ బాషాను బలంగా నెట్టారు. ఈ ఘటనలో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

డాంగే నగర్​లోని ఓ స్థలంలో ఉన్న రేకుల షెడ్డును కొందరు ధ్వంసం చేశారు. దీంతో షెడ్డు వద్ద ఇరువర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఆక్రమణ ఘటనపై పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ స్థలం తమదేనంటూ దానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉండటంతో ఖాళీగా ఉన్న తన స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నారని చాన్‌ బాషా ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.