ETV Bharat / crime

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకుమార్తెపై కత్తితో దాడి.. ఒకరు మృతి - కరీంనగర్​లో మహిళ దారుణ హత్య

Woman was murdered by unknown persons: విధి ఆమెపై కోపం చూపాడు ఏమో! భర్త చనిపోయి 20 రోజులు అయ్యింది. ఇంక ఏ దిక్కులేక, ఒంటరిగా ఉండలేక.. కన్న బంధాన్ని వదులుకోలేక పుట్టింటికి వచ్చేసింది.. అయితే మళ్లీ ఇక్కడా కూడా విధి ఆమెపై మరోలా చూసింది.. ఇంతకీ ఏం జరిగింది అసలు?

women murder
మహిళ హత్య
author img

By

Published : Oct 7, 2022, 11:33 AM IST

Woman was murdered by unknown persons: భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ.. పుట్టింటికి వెళితే అక్కడ హత్యకు గురైన ఘటన కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలంలోని రామకృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తల్లీ కుమార్తెలపై దాడి చేశారు. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా... తల్లికి తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్సై శీలం ప్రమోద్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్​ మండలంలోని రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న కొమ్మెర రాధవ్వ(75)కు కుమార్తె గుజ్జుల సులోచన ఉంది. ఆమెకు వివాహం అయింది. అయితే ఆమె భర్త 20రోజుల క్రితం చనిపోవడంతో ఒంటరిగా ఉండలేక తల్లి వద్దే ఉంటుంది. ఇద్దరు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సులోచన, ఆమె తల్లిపై దాడి చేశారు.

ఆ దాడిలో సులోచని అక్కడికక్కడే మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై ప్రమోద్​ రెడ్డి ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.