ETV Bharat / crime

తన కుమారుడి మృతిపై తొమ్మిదేళ్లుగా మరదలిపై పగ.. చివరకు ఏం చేసిందంటే.!

Woman Killed her Nephew: 'నా బాబు బతికిఉంటే ఇప్పుడు వాడికి పన్నెండేళ్లు ఉండేవేమో. చక్కగా బడికి వెళ్లేవాడు. అమ్మా అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు.' ఇలా తొమ్మిదేళ్లుగా ఆ తల్లి.. చనిపోయిన తన కుమారుడిని తలచుకుంటూ బతుకుతోంది. కానీ తన కళ్లముందు తన మరదలి(భర్త సోదరి) కుమారుడు కనబడేసరికి ఆ బాధ కాస్త కోపంగా మారింది. ఆ పిల్లాడిని ఎలాగైనా చంపాలని దృఢంగా నిశ్చయించుకుంది. అనుకున్నట్లుగా ఆ చిన్నారి ఉసురుతీసుకుంది. చివరికి కటకటాలపాలైంది. అసలేం జరిగిందంటే..

woman killed her nephew
మేనల్లుడిని హత్య చేసిన అత్త
author img

By

Published : Apr 9, 2022, 10:56 AM IST

Woman Killed her Nephew: అమ్మతనం విలువ ఏంటో ఆ పిలుపునకు నోచుకోని వాళ్లకు తెలుసు. బిడ్డ నోరారా అమ్మా అని పిలుస్తుంటే అందులో ఉన్న మాధుర్యాన్ని ఏ తల్లయినా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది. అలాంటి అనుభూతి పొందాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఆమె ఓ బిడ్డకు తల్లి.. మూడేళ్ల పాటు కుమారుడిని అపురూపంగా పెంచుకుంది. అంతలోనే ఆ బాలుడు గుంతలో పడి మరణించాడు. ఇది జరిగి తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటికీ ఆ బాధను మరిచిపోలేదు. ఈ క్రమంలో లేనిపోని అనుమానాలు పెంచుకుంది. ఆ అనుమానంతో ఏడేళ్ల బాలుడిని బలితీసుకుంది. అసలేం జరిగింది.? ఆ చిన్నారిని ఎందుకు చంపాలనుకుంది.?

తన కుమారుడి మృతికి మరదలే కారణమని రగిలిపోయిన ఆ మహిళ.. మరదలి కుమారుడిని హతమార్చి పగ తీర్చుకుంది. ఆ వివరాలను నిజామాబాద్‌లో సీపీ నాగరాజు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన రుక్సానాబేగం, అస్లాంఖాన్‌ల కుమారుడు ఫైజల్‌ఖాన్‌ తొమ్మిదేళ్ల క్రితం ఓ గుంతలో పడి మరణించాడు. అప్పటికి ఆ బాలుడి వయసు మూడేళ్లు. కుమారుడి మృతికి తన భర్త అస్లాంఖాన్‌ చెల్లెలు అయిన సనాబేగమే కారణమని రుక్సానా అనుమానం పెంచుకుంది. అందుకు ఎలాగైనా పగతీర్చుకోవాలని నిశ్చయించుకుంది. సమయం కోసం ఎదురూచూసింది.

ఈ క్రమంలో మార్చి 31న ఇంటి దగ్గర ఆడుకొంటున్న సనాబేగం కుమారుడు ఫయాజ్‌(7)ను ఆటోలో బోధన్‌కు తీసుకెళ్లి, అక్కడ ఒకరి ఇంట్లో ఉంచి తిరిగి ఆటోనగర్‌కు చేరుకుంది. అప్పటికే బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతుకుతుండగా.. తానూ వెతుకుతున్నట్లు వారిని నమ్మించింది. అదే రోజు రాత్రి మళ్లీ బోధన్‌కు వెళ్లిన రుక్సానాబేగం ఆ బాలుడిని హతమార్చింది. తరవాత నిజాంసాగర్‌ కొత్త కెనాల్‌ నీటిలో పడేసింది. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా విచారించిన పోలీసులు బాలుడిని హత్య చేసింది తన మేనత్త రుక్సానాబేగం, మరో బాలిక అని తేల్చారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

బిడ్డ దూరమైందనే ఓ తల్లి బాధ.. మరో తల్లికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అభం శుభం తెలియని చిన్నారి నిండునూరేళ్ల జీవితం నాశనమయ్యేలా చేసింది.

ఇదీ చదవండి: 'నాన్నా.. నేనూ నీతో వస్తానంటూ వెళ్లి'.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.