Mohabbatpur Tomb incident : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్‌పూర్‌లో సమాధిని తవ్వడం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన కొనింటి ఎలిజబెత్ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల 6న ఆమె సమాధిని గుర్తుతెలియని వ్యక్తులు తవ్వేసి... కాళ్లు, చేతులు, పుర్రె ఎముకలను తీసుకెళ్లనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కారంపొడి చల్లి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.
క్షుద్రపూజల కోసం ఎముకలు ఎత్తుకెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అని కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అప్పులే యమపాశాలై.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి కుటుంబం బలవన్మరణం