‘‘మీ నగ్న వీడియోలు బాగున్నాయ్... స్నేహితులందరికీ పంపేద్దామా?.. లేక డబ్బులిస్తారా? అంటూ సైబర్ నేరస్థురాలు ఓ ఈవెంట్ మేనేజర్‌ను బెదిరించి రూ.10 లక్షలు కొల్లగొట్టింది. ఆపై డబ్బు డిమాండ్ చేస్తుండడంతో బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి, తాత్కాలికంగా ఫేస్‌బుక్ ఖాతాను తొలగించండి అంటూ సంబంధిత నిర్వాహకులకు సూచించారు.
ఫేస్‌బుక్‌లో పరిచయమై..
తార్నాకలో నివసించే ఓ వ్యక్తి ఈవెంట్ మేనేజర్ హోదాలో ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తున్నాడు. వారం క్రితం ఓ యువతి స్నేహితురాలినవుతానంటూ అభ్యర్థన పంపడంతో అంగీకరించాడు. మర్నాడు వాట్సాప్ నంబర్ అడిగితే ఇచ్చాడు. ముంబయిలో తాను మోడలింగ్ చేస్తున్నానని తెలిపింది. రెండు రోజుల క్రితం వాట్సాప్ వీడియోకాల్‌లో మాట్లాడుతూనే దుస్తులు తీసేసింది. అతనితోనూ అలాగే చేయించింది. తర్వాత ఫోన్ చేసి.. అతడి నగ్న వీడియోను పంపించింది. రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. ఆమె సూచించిన ఖాతాలో సొమ్ము జమచేయగానే.. మళ్లీ రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. ఆ సొమ్మునీ సర్దుబాటు చేయగా.. మరో రూ.10 లక్షలు కావాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- ఇదీ చదవండి : పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!