ఉరితాడుకు వేలాడుతూ ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ కాలనీలో నివసించే జయంతి.. ఉరివేసుకొని మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తే చంపి ఉరేశాడని ఆరోపిస్తున్నారు.
కేసముద్రం మండలం పెద్ద మోరియా తండాకు చెందిన జయంతి(31), ధర్మారం తండాకు చెందిన సురేష్‌తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. తొర్రూరులోని రాజీవ్‌నగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్ రైసుమిల్లులో పనిచేస్తుండగా, జయంతి షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు శ్రీ వర్ధన్(5), సాయి సమిత్(4).
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!