ETV Bharat / crime

గుర్తు తెలియని మహిళ హత్య.. డ్రైనేజీలో మృతదేహం! - తెలంగాణ వార్తలు

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. కోర్టు బస్‌ స్టాప్ సమీపంలోని మురికి కాలువలో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మహిళ వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించారు.

woman-suspicious-death-in-karimnagar-district
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి..!
author img

By

Published : Mar 23, 2021, 1:13 PM IST

Updated : Mar 23, 2021, 3:09 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కోర్టు బస్ స్టాప్‌ సమీపంలోని మురికి కాలువలో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని కరీంనగర్ సీపీ కమలాసన్​రెడ్డి, అడిషనల్ సీపీ చంద్రమోహన్ పరిశీలిస్తున్నారు.

మహిళ మెడకు చున్నీ బిగించి హతమార్చి... డ్రైనేజీలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నగరంలోని అంబేడ్కర్ కూడలి నుంచి జడ్జి బంగ్లా వరకు సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఈ ఘటన వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

woman-suspicious-death-in-karimnagar-district
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి..!

మృతురాలిని గుర్తించిన వారికి తగిన పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. మహిళ వయస్సు 35-40 ఏళ్లు, చామనచాయ రంగు, ఎత్తు-5 ఫీట్లు, దుస్తులు: ముదురు పింక్ కలర్ కుర్తా పైజామా, మెడలోని పసుపు తాడులో ఎరుపు, నలుపు పూసలు, ఒక పుస్తెలో ఏసుక్రీస్తు సిలువ, కాళ్లకు పట్టీలు, ఎడమ చేతిపై మ్యూజిక్ సింబల్ టాటూ(పచ్చబొట్టు) గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి... వారికి తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు.

వివరాలు తెలపాల్సిన ఫోన్ నంబర్లు..

  1. ఇన్‌స్పెక్టర్ టూ టౌన్: 9440795107
  2. ఏసీపీ కరీంనగర్ టౌన్: 9440795111
  3. డయల్ 100

ఇదీ చదవండి: డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు

Last Updated : Mar 23, 2021, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.