Woman suicide attempt: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. తమ భూమిని అమ్మేయాలంటూ ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ తనపై ఒత్తిడి చేస్తోందని దీనిపై జిల్లా కలెక్టర్‌కి సమస్యను విన్నవించుకునేందుకు వచ్చిన మహిళ అదే ఆఫీస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండంలం కవాడిపల్లి గ్రామానికి చెందిన జయశ్రీ అనే మహిళకు గ్రామంలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. తమ భూమిని అనుచరించి పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమె భూమిని అమ్మాలని ఒత్తిడి చేస్తోందని బాధితురాలు వాపోయింది.
ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థ కలసి తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌కి వెళ్లిన జయశ్రీ.. జాయిట్ కలెక్టర్ తిరుపతి రావుతో తన బాధను వివరించే క్రమంలో తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్‌తో చేయి కోసుకోబోయింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను వారించి ఆమె దగ్గర నుంచి బ్లేడ్‌ను తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు, కొందరు అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు.
"మాది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లి సార్.. మాకు మా గ్రామంలో సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాలు భూమి ఉంది. మా భూమి పక్కనే ఉన్న శ్రీజ వెంచర్ యజమానులు మా భూమిని రూ.3 కోట్ల 80 లక్షలకు అడిగారు. మేము ఇవ్వలేదు. దీంతో వారు అధికారులతో కలసి మమ్మల్ని వేధిస్తున్నారు. మా భూమికి సంబంధించి పత్రాలు ఆన్లైన్లో కనిపించడం లేదు. స్థానిక ఎమ్మార్వో కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు."- జయశ్రీ, బాధిత మహిళ
ఇవీ చదవండి: