ETV Bharat / crime

Woman murder:సైకో కిల్లర్ దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య - వరంగల్ జిల్లా తాజా నేర వార్తలు

Woman murder: అతడిది సైకో మనస్తత్వం. ఒంటరి మహిళలను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేస్తాడు. కొద్దిరోజులు బాగానే నటిస్తాడు. ఆతరువాత అతనిలోని ఉన్మాది మేల్కొని మహిళలను దారుణంగా చిత్రహింసలకు గురి చేసి వారి ప్రాణాలు తీస్తాడు.

మహిళ దారుణ హత్య
మహిళ దారుణ హత్య
author img

By

Published : Jul 4, 2022, 5:07 PM IST

Woman murder: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ సైకో కిల్లర్. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వెంకన్న, మంజులతో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇంతలో అతడిలో నిద్రలేచిన ఉన్మాది ఆమెను కత్తిపీటతో కోసి రాక్షసంగా హత్యకు పాల్పడ్డాడు. గతంలో కూడా కొత్తగూడెంకు చెందిన మరో మహిళను సైతం ఇదే తీరుగా చంపాడని గ్రామస్థులు తెలిపారు.

అతను సైకో అని వారు చెప్పారు. ఎప్పటికి మత్తులో తూలుతూ కనిపిస్తాడని పేర్కొన్నారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గతంలోనూ కరోనా మొదటి దశలో నిందితుడు కొవిడ్ బారిన పడి ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆర్టీసీ బస్సులో పరారై పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు.

ఇదీ చదవండి: Bank theft: మంకీ క్యాప్స్.. గ్యాస్ కట్టర్స్.. జులాయి సీన్ రిపీట్..!

బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్​రే.. రిపోర్ట్స్​ చూస్తే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.