ETV Bharat / crime

women suicide: ఉరి వేసుకుని గర్భిణి ఆత్మహత్య.. కారణం అదేనా ! - రంగారెడ్డి నేర వార్తలు

రంగారెడ్డిజిల్లా శంకర్​పల్లి మండలం ఇంద్రరెడ్డినగర్​లో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో భర్త లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. దంపతుల మధ్య విభేదాల వల్ల రేవతి క్షణికావేశానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

women suicide
women suicide
author img

By

Published : Sep 14, 2021, 10:24 AM IST

అనుమానాస్పద స్థితిలో నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘట సోమవారం శంకర్‌పల్లి మండలం జన్వాడ ఇంద్రారెడ్డి కంచలో వెలుగు చూసింది. నార్సింగి ఎస్‌ఐ బలరాం నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌ జిల్లా పరిగి సమీపంలోని నజీరాబాద్‌ తండాకు చెందిన పట్లవత్‌ రేవతి(23), రాహుల్‌లు 7 నెలల క్రితం తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. రేవతి ప్రస్తుతం గర్భిణి. జేసీబీ డ్రైవర్‌గా పనిచేసే రాహుల్‌ సోమవారం ఉదయం విధులకు వెళ్లాడు. సాయంత్రం రాహుల్‌ ఫోన్‌ చేయగా రేవతి ఫోన్‌ ఎత్తక పోవడంతో పక్కింట్లో ఉండే రమేష్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

అతడు వెళ్లి కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులు భర్తకు విషయం చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. దంపతుల మధ్య విభేదాల వల్ల రేవతి క్షణికావేశానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Doctor Suicide: ప్రముఖ వైద్యుడి సూసైడ్.. ఒంటి మీద డ్రెస్ ఎందుకు లేదు? అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.