Woman Suicide in Nirmal : ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శాంతినగర్ కాలనీకి చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం సంతోశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. శ్రీలత ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తి చేసింది. బ్యాంకింగ్, గురుకులాల్లో ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తోంది. ఎన్నిసార్లు రాసినా.. విజయం సాధించలేకపోయానని తీవ్ర మనోవేదనకు గురైంది.
Woman Commits Suicide in Nirmal : ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి శుక్రవారం రోజున.. ఉరి వేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అప్పుడే ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీలత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
- ఇదీ చదవండి : భార్యను హత్య చేసి.. ఆనవాళ్లు చెరిపి.. ఆపై కట్టుకథ