ETV Bharat / crime

WOMAN DIED: మిరపకాయలు పట్టించేందుకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది

మృత్యువు ఎవరిని ఏ రూపంలో వెంటాడుతుందో తెలియదు. కానీ అది ఎప్పుడు వచ్చినా చేసేదేమి లేదు. ఓ మహిళ మిరపకాయలు పట్టించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గిర్నీలోకి వెళ్లి మృతి చెందిన ఘటన చల్మేడ గ్రామంలో చోటు చేసుకుంది.

WOMAN DIED
మహిళ మృతి
author img

By

Published : Nov 8, 2021, 1:00 PM IST

మిరపకాయలు పట్టించడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు మృత్యు ఒడికి చేరిన ఘటన మెదక్‌ జిల్లా చల్మేడ గ్రామంలో జరిగింది. చల్మేడ గ్రామానికి చెందిన బావనాక వీరమణి అనే మహిళ... మిరపకాయలు పట్టించాడనికి గిర్నీ వద్దకు వెళ్లింది. గిర్నీలో వేస్తున్నప్పుడు కిందపడిపోయిన మిరపకాయలు తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చీర కొంగు పట్టాకు తాకింది.

పట్టా ఆమెను లాగేయడంతో వీరమణికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు శ్రీనివాస్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి

ఇంట్లో పేలిన బాణాసంచా.. మహిళ మృతి

లైవ్​ వీడియో​: బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి

ఇంట్లో చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం

నగదు పేమెంటే కావాలన్నారు.. నడిరోడ్డుపైనే ప్రాణాలు పోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.