ETV Bharat / crime

Arrest: అనుమతి లేకుండా విత్తనాల వ్యాపారం, రూ.17లక్షల సరుకు స్వాధీనం - two members arrested

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు, ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 40 క్వింటాళ్ల ఎరువులు, కాలం చెల్లిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.16,79,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Nagar Kurnool District Amrabad
Arrest: అనుమతి లేకుండా విత్తనాల వ్యాపారం, అరెస్టు
author img

By

Published : Jun 11, 2021, 6:43 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో అక్రమంగా విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులను పోలీసులు పట్టుకున్నారు. బీకే లక్ష్మాపూర్​కు చెందిన చారకొండ రామాంజనేయులు, లక్ష్మాపూర్ తండాకు చెందిన గంటెల ప్రతాప్​లు లైసెన్సు లేకుండా రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారు.

పోలీసులు, వ్యవసాయ అధికారులు జరిపిన దాడిలో అనుమతి లేని… 40 క్వింటాళ్ల ఎరువులు, కాలం చెల్లిన పురుగు మందులు, 1,390 పత్తి విత్తన ప్యాకెట్లు, 5 కిలోల కంది విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 16,79,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.