ETV Bharat / crime

ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కడతేర్చిన ఇల్లాలు.. చివరకు..! - భార్య ప్రియుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలింపు

Ghatkesar Murder Case: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ప్రియుడి మోజులో పడి అతడు చెప్పిన మాటలు నమ్మి.. ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

murder
హత్య
author img

By

Published : Feb 10, 2023, 3:16 PM IST

Ghatkesar Murder Case: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ప్రియుడిని ఘట్​కేసర్​ పోలీసులు అరెస్ట్​ చేసి.. రిమాండ్​కు తరలించారు. ఘట్​కేసర్​ మండలంలోని అవుషాపూర్​లో షేక్​ మౌలానా(43), అతని భార్య షానాబీ(40) నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు. అంతా సాఫీగా సాగిపోతుండగా.. ఒక చిక్కువచ్చి పడింది.

18 ఏళ్ల క్రితం ఆమె బంధువుల వద్ద ట్రాక్టర్​ డ్రైవర్​గా పని చేస్తున్న బెజిలీ బాబు అలియాస్​ ఎ.బాబు షానాబీకు పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. అయితే అదే సమయంలో మౌలానా ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లాడు. భర్త ఇంటి దగ్గర లేకపోవడంతో భార్య, ఆమె ప్రియుడి జల్సాలకు హద్దే లేకుండా పోయింది. వారి ఆటలు ఇలా సాగుతూ ఉండగా.. పది నెలల క్రితమే భర్త దుబాయ్​ నుంచి తిరిగివచ్చాడు.

షానాబీ భర్త తిరిగి రావడంతో వారు ఇద్దరు కలుసుకోవడానికి సమయం దొరికేది కాదు. దాంతో ఫోన్​లో మాట్లాడుకునేవారు. ఈ విషయాన్ని గమనించిన భర్త మౌలానా.. భార్యపై అనుమానంతో గొడవపడేవాడు. వీరి విషయం పూర్తిగా తెలుసుకున్న మౌలానా ఇక్కడ ఉంటే ప్రమాదం అని భావించి.. ఇంటిని అమ్మేసి భార్య, పిల్లలతో దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాడు.

ఈ విషయం ఆమె ప్రియుడికి చెప్పడంతో.. అడ్డుగా ఉన్న మౌలానాను చంపాలని ఆమెపై ప్రియుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ నెల 5వ తేదీన బెజిలీబాబు మద్యం సీసాలోకి సిరంజీతో పురుగు మందు కలిపి ఆమెకు ఇచ్చి పంపించాడు. అదే రోజు కొడుకుతో కలిసి చేపల వేటకు వెళ్లిన మౌలానా సాయంత్రం ఇంటికి వచ్చాడు. మద్యం కోసం భార్యను రూ.100 అడిగాడు. ఆమె ఆ డబ్బులు ఇవ్వకుండా విషం ఉన్న మద్యం సీసాను తనకు ఇచ్చింది. అతడు తాగిన కొద్దిసేపటికే కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మౌలానా మృతి చెందాడు. ఈ విషయంలో భార్యపై అనుమానం రావడంతో పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపడితే.. ఆమె జరిగిన విషయం పోలీసులకు తెలిపింది. దీంతో బాబును.. ఆమెను పోలీసులు అరెస్ట్​ చేశారు.

నిందితురాలు
నిందితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.