ETV Bharat / crime

Selfie Suicide: భర్తకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంది... ఎందుకంటే... - మదనపల్లెలో భార్య ఆత్మహత్య కేసు

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌(Video Call) చేసి ఆత్మహత్య(Selfie Suicide) చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె ఉరి వేసుకుందని వివాహిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

suicide
suicide
author img

By

Published : Oct 30, 2021, 10:05 AM IST

కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన భర్తకు వీడియోకాల్‌(Video Call) చేసి ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. అనంతపురం జిల్లా బాబేనాయక్‌ తండాకు చెందిన రమ్యశ్రీకి(22) కర్ణాటక చేలూరుకు చెందిన చందునాయక్‌తో వివాహమైంది. వీరి దాంపత్య బంధం మూడేళ్లు చూడముచ్చటగా సాగింది.

అయితే కొన్ని రోజులుగా కుటుంబ విషయమై వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో రమ్య తన 11 నెలల కుమార్తెను తీసుకుని మదనపల్లెలోని ఎస్‌బీఐ కాలనీ విస్తరణ ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. తనను ఎందుకు తీసుకెళ్లడం లేదని శుక్రవారం రోజు భర్తకు వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి అతను చూస్తుండగానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని రమ్యశ్రీ తల్లి కమలమ్మకు ఫోన్‌ చేసి చెప్పాడు. అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె ఉరి వేసుకుందని కమలమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Murder: దారుణం... కొడుకును చంపిన తండ్రి... ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.